Ponnam Prabhakar. Gundla Pravalika (File Photo)
* మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి..
ఆకేరు న్యూస్, నెట్వర్క్ : హైదరాబాద్లో చికిత్స పొందుతూ మణుగూరు డిపోకు చెందిన మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి చెందడం పట్ల తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రవళిక మృతి తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు.
ఇటీవల ప్రయాణికులతో జరిగిన వివాదంలో బస్సు టైర్ల కింద పడి తీవ్రంగా గాయపడిన ప్రవళికకు హైదరాబాద్లోని సాయి సంజీవని ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించామని మంత్రి తెలిపారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడి తిరిగి కోలుకొని వస్తారని ఆశించామని, అయితే మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు.
* ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ అండగా ఉంటుంది..
ప్రవళిక మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి తెలియజేశారు. ఈ విషాద సమయంలో ప్రవళిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

