దేవసాని కృపాకర్
* మాజీ ఎంపీటీసీకి పార్టీ బాధ్యతలు
* నూతన కార్యవర్గ నియామక సమావేశంలో ప్రకటన
ఆకేరు న్యూస్, పాలకుర్తి: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓబీసీ మోర్చా పాలకుర్తి మండల నూతన అధ్యక్షుడిగా బొమ్మేర గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ దేవసాని కృపాకర్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ పాలకుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓబీసీ మోర్చా నూతన కార్యవర్గ నియామక సమావేశంలో ఆయన పేరును ప్రకటించారు.
పాలకుర్తి మండల బీజేపీ అధ్యక్షుడు మారం రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మెరబోయిన సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో బీసీ వర్గాలకు బీజేపీ ప్రాధాన్యత కల్పిస్తోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో సముచిత ప్రాధాన్యత కల్పించేందుకు పార్టీ కృషి చేస్తోందని తెలిపారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన దేవసాని కృపాకర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో మండల అధ్యక్షుడిగా నియమించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన మండల అధ్యక్షుడు మారం రవికుమార్, జిల్లా నాయకులు దొంగరి మహేందర్, కమ్మగాని శ్రీకాంత్, మండల ప్రధాన కార్యదర్శి పెనుగొండ సోమేశ్వర్, ఉపాధ్యక్షుడు పబ్బా సంతోష్‌తో పాటు ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పాలకుర్తి మండలంలో బీజేపీ బలోపేతానికి, బీసీల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తానని కృపాకర్ వెల్లడించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

