Tamil Nadu Election Duty Incentive
* తమిళనాడు సర్కార్ కీలక ప్రకటన
* వేలాది మంది సిబ్బందికి లబ్ధి
ఆకేరు న్యూస్, డెస్క్: ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి తమిళనాడు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకం ప్రకటించింది. 2026 అసెంబ్లీ ఎన్నికల విధులు నిర్వహించిన వారికి గౌరవ వేతనం చెల్లించేందుకు ఏకంగా రూ.198 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ కోసం పనిచేసిన వేలాది మంది అధికారులు, సిబ్బందికి ఈ నిర్ణయంతో ప్రయోజనం కలగనుంది.
జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్లకు ఒక నెల బేసిక్ పేను గౌరవ వేతనంగా చెల్లించనున్నారు. అయితే ఈ మొత్తం గరిష్టంగా రూ.45 వేలుగా నిర్ణయించారు. ఎన్నికల నిర్వహణలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన అధికారులకు ఈ ప్రోత్సాహకం అందనుంది.
ఫ్లయింగ్ స్క్వాడ్స్కు రూ.30 వేల వరకు
ఎన్నికల సమయంలో అక్రమ నగదు, ఇతర ఎన్నికల ఉల్లంఘనలను పర్యవేక్షించే ఫ్లయింగ్ స్క్వాడ్స్, వీడియో సర్వైలెన్స్ బృందాల్లో పనిచేసిన సిబ్బందికి గరిష్టంగా రూ.30 వేల వరకు గౌరవ వేతనం చెల్లించనున్నారు. జిల్లా రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు, ఇతర క్షేత్రస్థాయి ఎన్నికల సిబ్బందికి వారి హోదా, బాధ్యతలకు అనుగుణంగా వేర్వేరు స్లాబ్లలో గౌరవ వేతనం అందించనున్నారు.
ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన అధికారులు, సిబ్బంది సేవలకు గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ.198 కోట్ల కేటాయింపుతో ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ఆర్థిక ప్రోత్సాహకం అందనుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

