ఆర్ట్, యోగా, కంప్యూటర్ టీచర్లు, లైబ్రేరియన్ పోస్టులు
* ఆర్ట్, యోగా, కంప్యూటర్ టీచర్లు, లైబ్రేరియన్ పోస్టులు
* నవంబర్ 12 వరకు దరఖాస్తులు
Jobs| ఆకేరు న్యూస్, హనుమకొండ: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు హనుమకొండ జిల్లా విద్యాశాఖ శుభవార్త అందించింది. తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో ఖాళీగా ఉన్న 12 అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్ట్ టీచర్, యోగా టీచర్, కంప్యూటర్ టీచర్, లైబ్రేరియన్ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు. సంబంధిత విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు నవంబర్ 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఒక్కో విభాగంలో 3 పోస్టులు
జిల్లా కలెక్టర్, కాకతీయ ఉద్యోగ విజ్ఞాన సంస్థ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ నియామక ప్రక్రియ చేపడుతున్నారు. మొత్తం 12 పోస్టులను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు.
ఆర్ట్ టీచర్: 3 పోస్టులు – నెలకు రూ.22,750
యోగా టీచర్: 3 పోస్టులు – నెలకు రూ.22,750
కంప్యూటర్ టీచర్: 3 పోస్టులు – నెలకు రూ.22,750
లైబ్రేరియన్: 3 పోస్టులు – నెలకు రూ.19,500
ముల్కనూర్, ఎల్కతుర్తి, కమలాపూర్ ప్రాంతాల్లోని తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు.
పోస్టుల వారీగా విద్యార్హతలు
ఆర్ట్ టీచర్: అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, స్కల్ప్చర్, కమర్షియల్ ఆర్ట్స్, ప్రింట్ మేకింగ్, యానిమేషన్ విభాగాల్లో ఎంఎఫ్ఏ లేదా బీఎఫ్ఏ పూర్తి చేసిన వారు అర్హులు.
యోగా టీచర్: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌తో పాటు యోగాలో డిప్లొమా లేదా డిగ్రీ కలిగి ఉండాలి. యోగా స్పెషలైజేషన్‌తో బీపీఈడీ చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
కంప్యూటర్ టీచర్: కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ లేదా బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్ తదితర అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
లైబ్రేరియన్: లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ లేదా బ్యాచిలర్ డిగ్రీ (ఎం.లిబ్.సైన్స్, బి.లిబ్.సైన్స్) కలిగి ఉండాలి.
వయోపరిమితి 21 నుంచి 44 ఏళ్లు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థుల విద్యార్హతలు, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి ఎంపిక చేయనున్నారు.
ముఖ్యమైన తేదీలు ఇవే!
దరఖాస్తుల ప్రారంభం: నవంబర్ 7, 2026
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 12, 2026
దరఖాస్తుల స్వీకరణ చివరి సమయం: సాయంత్రం 5 గంటలు
ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 19, 2026
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 11 గంటలు
ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?
అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ఫారంతో పాటు విద్యార్హతలు, ఇతర అవసరమైన ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులను జతచేసి హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలి. నవంబర్ 19న ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్లోని డీపీసీ కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
ఉద్యోగ కాలపరిమితి ఎంత?
ఎంపికైన అభ్యర్థులు 2026 నవంబర్ 20 నుంచి 2027 మార్చి 31 వరకు లేదా వేసవి సెలవులు ప్రారంభమయ్యే వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకుని ఈ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

