Employees JAC leaders met Warangal West MLA Naini Rajender Reddy
* దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఉద్యోగ సంఘాల నేతలు
ఆకేరు న్యూస్, హనుమకొండ : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డిని హనుమకొండలోని వారి క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
* హనుమకొండ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ
ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మరియు టీఎన్జీవోస్ (TNGOs) యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి ఘనంగా దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసి, పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఉద్యోగులకు సంబంధించిన వివిధ అంశాలపై సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ హనుమకొండ జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, గౌరవ అధ్యక్షులు శ్యాంసుందర్, అసోసియేట్ అధ్యక్షులు పుల్లూరి వేణుగోపాల్, కేంద్ర సంఘం ఉపాధ్యక్షులు రాము నాయక్, కార్యదర్శి సారంగపాణి, కార్యవర్గ సభ్యులు లక్ష్మీ ప్రసాద్ తదితర జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని శాసనసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

