CM Revanth Reddy
* ప్రజా సాంస్కృతిక రంగానికి తీరని లోటు
* నీల సేవలు మరువలేనివి..
* కుటుంబానికి సీఎం ప్రగాఢ సానుభూతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రముఖ పరిశోధకుడు ఆచార్య జయధీర్ తిరుమలరావు సతీమణి నీల ఆకస్మికంగా కన్నుమూయడంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం ప్రజా సాంస్కృతిక రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.
ఆదివాసీ, గిరిజన సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచే ఆద్యకళలోని అరుదైన చారిత్రక వస్తువులు, సంప్రదాయ వాద్యాలు, తాళపత్ర గ్రంథాల సంరక్షణలో నీల గారు విశేష సేవలు అందించారని సీఎం గుర్తుచేశారు.
ఆద్యకళ పరిరక్షణకు ఆమె చేసిన కృషి కారణంగా ‘ఆద్యకళకు అమ్మ’గా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఆమె అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివని సీఎం అన్నారు. నీల గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

