Maulana Abul Kalam Azad Jayanti
* ఘనంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి
ఆకేరు,న్యూస్ ములుగు: మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. బుధవారం భారత తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ములుగు సమీకృత జిల్లా కార్యాలయ సమావేశ మందిరంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సి.హెచ్. మహేందర్ జితో కలిసి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుడిగా, భారత తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ దేశానికి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. దేశంలో విద్యావ్యవస్థ బలోపేతానికి, విద్యావకాశాల విస్తరణకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఒక్కరూ విద్య ప్రాముఖ్యతను గుర్తించాలని పేర్కొన్నారు. జాతీయ సమైక్యత, సామరస్యం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని ఆదర్శంగా తీసుకుని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ అధికారి బి. రామ్మోహన్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎ. సిద్ధార్థ రెడ్డి, పరిపాలన అధికారి రాజ్‌కుమార్, జిల్లాస్థాయి ఉన్నత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

