Shekhar Master Car Accident
* షూటింగ్ నుంచి వస్తుండగా యాక్సిడెంట్..
* శేఖర్ మాస్టర్ వీడియోతో క్లారిటీ
* కారులో నలుగురం.. ఎవరికీ ఏమీ కాలేదు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆయన వెల్లడించారు. అయ్యప్ప స్వామి దయ వల్ల అందరం క్షేమంగా ఉన్నామని తెలిపారు. నిన్న రాత్రి షూటింగ్లో పాల్గొన్నామని, ఉదయం షూటింగ్ పూర్తయ్యాక సుమారు 5:30 నుంచి 6 గంటల మధ్య ఇంటికి బయలుదేరిన సమయంలో ప్రమాదం జరిగిందని శేఖర్ మాస్టర్ వివరించారు. కారులో మొత్తం నలుగురం ఉన్నామని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. కారు వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు.
తనకు ప్రమాదం జరిగిందన్న వార్త తెలియడంతో చాలామంది ఫోన్లు చేసి, సందేశాలు పంపుతున్నారని శేఖర్ మాస్టర్ పేర్కొన్నారు. తన క్షేమ సమాచారం అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో వీడియో ద్వారా స్పందించినట్లు చెప్పారు. అయ్యప్ప స్వామి దయ వల్ల తామంతా సురక్షితంగా ఉన్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిమానులకు భరోసా ఇచ్చారు. ఈరోజు రాత్రి మళ్లీ షూటింగ్కు బయలుదేరుతున్నానని వెల్లడించారు. తన క్షేమం గురించి ఆరా తీసిన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చివరగా “స్వామియే శరణమయ్యప్ప” అంటూ తన వీడియోను ముగించారు.
View this post on Instagram

Please tell us what is wrong. Your report will be sent to the website team.

