Shekhar Master Car Accident
* తృటిలో తప్పిన పెను ముప్పు
* శంషాబాద్ వద్ద యాక్సిడెంట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. శంషాబాద్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో శేఖర్ మాస్టర్‌కు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. కారులో ఉన్న మిగిలిన వారంతా క్షేమంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.
* షూటింగ్ ముగించుకుని వస్తుండగా ప్రమాదం
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమా షూటింగ్ ముగించుకుని శేఖర్ మాస్టర్ తన బృందంతో కలిసి కారులో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో శంషాబాద్ సమీపానికి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. వెనుక నుంచి జరిగిన బలమైన ఢీకొట్టడంతో శేఖర్ మాస్టర్ కారు వెనుక భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. కారులో ఉన్న ఇతరులు మాత్రం ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారు.
* అభిమానుల్లో ఆందోళన..
శేఖర్ మాస్టర్ కారు ప్రమాదానికి గురైందన్న వార్తతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఆయనకు స్వల్ప గాయాలే కావడం, మిగిలిన వారంతా క్షేమంగా ఉండటంతో అభిమానులు ఊరట చెందుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

