Warangal DIET Jobs notification
* వరంగల్ డైట్లో ఉద్యోగాలు
* రెండు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు
* రూ.23,400 వరకు గౌరవ వేతనం
ఆకేరు న్యూస్, హనుమకొండ:
హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థ (డైట్), వరంగల్లో ఖాళీగా ఉన్న రెండు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రధానాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. రిటైర్డ్, నిరుద్యోగ అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎంపిక సమయానికి అభ్యర్థుల వయసు 65 ఏళ్లలోపు ఉండాలని స్పష్టం చేశారు.
* ఏయే పోస్టులు ఉన్నాయంటే?
ఎస్సీఈఆర్టీ తెలంగాణ, హైదరాబాద్ సంచాలకుల ఆదేశాల మేరకు తాత్కాలిక ప్రాతిపదికన ఈ నియామకాలు చేపడుతున్నారు. మొత్తం రెండు పోస్టుల్లో ఒకటి విజువల్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ విభాగంలో, మరొకటి సైన్స్ పెడగాజీ విభాగంలో ఉన్నాయి.
విజువల్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్
పోస్టుల సంఖ్య: 1
మీడియం: తెలుగు, ఇంగ్లీష్
విద్యార్హత: ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్, డాన్స్, థియేటర్ తదితర సంబంధిత విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ (M.F.A), బ్యాచిలర్స్ డిగ్రీ (B.F.A) కలిగి ఉండాలి.
గౌరవ వేతనం: నెలకు రూ.15,600.
సైన్స్ అండ్ ఇట్స్ పెడగాజీ
పోస్టుల సంఖ్య: 1
మీడియం: ఉర్దూ
విద్యార్హత: సైన్స్ సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG), ఎం.ఎడ్ (M.Ed) కలిగి ఉండాలి.
గౌరవ వేతనం: నెలకు రూ.23,400.
* దరఖాస్తు చేసుకోవడం ఎలా?
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థ, వరంగల్ కళాశాలలో అందించే దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేయాలి. దరఖాస్తుతో పాటు ఒక ఫొటో, విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులు జతచేసి నవంబర్ 13 నుంచి 16వ తేదీ వరకు కళాశాలలో సమర్పించాలి.
* ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు
నవంబర్ 13–16: దరఖాస్తుల స్వీకరణ
నవంబర్ 16: తుది జాబితా ప్రకటన
నవంబర్ 19: 1:5 నిష్పత్తిలో మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు డెమో, ఇంటర్వ్యూ
నవంబర్ 20: ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన
నవంబర్ 21: ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేరాలి.
ఎంపికైన అభ్యర్థులు 2026–27 విద్యా సంవత్సరానికి గెస్ట్ ఫ్యాకల్టీగా ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థ, వరంగల్లో విధుల్లో చేరాల్సి ఉంటుందని ప్రధానాచార్యులు తెలిపారు. మరిన్ని వివరాలు, దరఖాస్తు ఫారం కోసం ఆసక్తి గల అభ్యర్థులు డైట్ కళాశాలను సంప్రదించవచ్చు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

