టార్టాయిస్ మూవీ నుంచి రంగు రంగు రంగు పిల్లరో సాంగ్ రిలీజ్
* జానపద బీట్తో ఆకట్టుకుంటున్న పెంచల్ దాస్!
* రాజ్ తరుణ్, అమృత చౌదరిపై పాట చిత్రీకరణ..
* అనూప్ రూబెన్స్ సంగీతం, పెంచల్ దాస్ గాత్రం ప్రత్యేక ఆకర్షణ
ఆకేరు న్యూస్, సినిమా : యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న కొత్త సినిమా ‘టార్టాయిస్’ (Tortoise Movie) నుంచి మరో పాట విడుదలైంది. ఈ సినిమాలోని ‘రంగు రంగు రంగు పిల్లరో..’ లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
అనూప్ రూబెన్స్ అందించిన ఎనర్జిటిక్ ట్యూన్‌కు ప్రముఖ జానపద గాయకుడు, కవి పెంచల్ దాస్ సాహిత్యం అందించడంతో పాటు స్వయంగా ఆలపించారు. జానపద శైలిలో సాగుతున్న ఈ పాట సంగీత ప్రియులను ఆకట్టుకునేలా ఉంది.
* అనూప్ రూబెన్స్ ట్యూన్.. పెంచల్ దాస్ గాత్రం..
‘రంగు రంగు రంగు పిల్లరో..’ పాటలో జానపద పదాలు, ఉత్సాహభరితమైన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మేడలోని పిల్ల, ఆమె అలంకరణలు, గాజులు, ముక్కెర, కమ్మలు, గజ్జెలను వర్ణిస్తూ పెంచల్ దాస్ రాసిన సాహిత్యం సాగుతుంది. తనదైన జానపద గాత్రంతో ఆయన పాటకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చారు.
ఈ పాటలో సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, పెంచల్ దాస్ ఇద్దరూ కలిసి కనిపించడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘నీ పరిచయం..’ పాటకు సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడు ‘రంగు రంగు రంగు పిల్లరో..(Rangurangu Rangupillaro Song)’ పాటతో ‘టార్టాయిస్’ మ్యూజికల్ జర్నీ కొనసాగుతోంది.
* సస్పెన్స్, డ్రామాతో ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్..
‘టార్టాయిస్ (Tortoise Movie)’ చిత్రాన్ని రిత్విక్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. సస్పెన్స్, డ్రామా అంశాలతో కూడిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రాజ్ తరుణ్ సరసన అమృత చౌదరి కథానాయికగా నటిస్తున్నారు.
అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్వీఎల్ క్రియేషన్స్ బ్యానర్లపై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మానస కుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమాలో షిజు ఏఆర్, రవి కాలె, మొయిన్ తదితరులు నటిస్తున్నారు. పాటలతో ఇప్పటికే ఆసక్తి పెంచుతున్న ‘టార్టాయిస్’ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాలి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

