DNK pre release event
* ఫ్యామిలీతో కలిసి చూడండి – శ్రీ విష్ణు
* మౌళిపై ప్రశంసలు కురిపించిన సినీ ప్రముఖులు..
* నవంబర్ 13న థియేటర్లలోకి క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్
ఆకేరు న్యూస్, సినిమా: ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన యువ నటుడు మౌళి తనూజ్ ప్రశాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘DNK’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్కు శ్రీను కంబాల దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘DNK’ సినిమా ‘లిటిల్ హార్ట్స్’ కంటే పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.
* ఫ్యామిలీతో కలిసి సినిమా చూడండి – శ్రీ విష్ణు
శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ‘DNK’లో ఆలీ మంచి పాత్రలో కనిపించడం సంతోషంగా ఉందన్నారు. చాలా మంది యువకులు కలిసి ఈ సినిమాను రూపొందించారని చెప్పారు. మౌళి ఎంతో ప్రణాళికతో ఈ చిత్రాన్ని పూర్తి చేశాడని, తనకు అన్ని సినిమా విభాగాలపై మంచి అవగాహన ఉందని ఇటీవలే తెలిసిందని సరదాగా వ్యాఖ్యానించారు. ‘లిటిల్ హార్ట్స్’ సినిమా చూసిన తర్వాత నవ్వుతూనే ఉన్నాను. ‘DNK’ కూడా చాలా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అయి నిర్మాతలకు మూటలు మూటలుగా డబ్బులు రావాలి. నవంబర్ 13న పెద్దలంతా సినిమా చూడండి. 14న పిల్లలను కూడా తీసుకెళ్లండి. కుటుంబంతో కలిసి ఈ సినిమాను చూసి పెద్ద హిట్ చేయండి” అని శ్రీ విష్ణు కోరారు.
* మౌళిపై పూర్తి నమ్మకంతో బాధ్యతలు అప్పగించాం – నిర్మాత రవిశంకర్
నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. మౌళి ఈ సినిమాను దగ్గరుండి చూసుకుంటూ పూర్తి బాధ్యతతో నిర్మాణ ప్రక్రియలో భాగం కావాలని కోరాడన్నారు. అతడిపై నమ్మకంతో పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని తెలిపారు. ‘లిటిల్ హార్ట్స్’తో మౌళి తన ప్రతిభను నిరూపించుకున్నాడని, ‘DNK’ కూడా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్ అనిల్, చెర్రీ తనకు ఎంతో సహకరించారని మౌళి పేర్కొన్నారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రతి ప్రాజెక్ట్‌కు వారు ఇచ్చే ప్రోత్సాహం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. దర్శకుడు శ్రీను కంబాల మంచి వినోదాత్మక కథను తీసుకొచ్చారని, ప్రేక్షకులు సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.
* ‘DNK’ కోసం చాలా కాలంగా ఎదురుచూశాను – శ్రీను కంబాల
దర్శకుడు శ్రీను కంబాల మాట్లాడుతూ.. మైత్రీ మూవీ మేకర్స్‌లో సినిమా చేయడం గర్వంగా ఉందన్నారు. మౌళి చెప్పిన కథ తన జీవితాన్ని మార్చిందని పేర్కొన్నారు. సీనియర్ నటులు ఆలీ, రజిత, ప్రియలతో కలిసి పనిచేయడం మంచి అనుభవమని చెప్పారు. “ఈ రోజు కోసం చాలా కాలంగా ఎదురుచూశాను. ఎంతో ప్యాషన్‌తో ఇక్కడి వరకు వచ్చాను. నవంబర్ 13న నా మూమెంట్ రాబోతోంది. సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. సినిమాపై నాకు చాలా నమ్మకం ఉంది. సినిమా చూడకపోతే మౌళి మీద ఒట్టు” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
* ‘ఉప్పెన’ అంత పెద్ద హిట్ కావాలి – బుచ్చిబాబు సానా
దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. ‘ఉప్పెన’ సినిమాతో పరిచయమైన జయకృష్ణకు ‘లిటిల్ హార్ట్స్’ మంచి గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని చెప్పారు. ‘DNK’ కూడా ‘ఉప్పెన’ అంత పెద్ద హిట్ కావాలని ఆకాంక్షించారు.
దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. ‘లిటిల్ హార్ట్స్’ విజయం తర్వాత మౌళి తన తల్లిదండ్రులను చూసుకున్న తీరు తనను భావోద్వేగానికి గురిచేసిందన్నారు. మౌళి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నారు. ‘DNK’ టైటిల్ కథకు చక్కగా సరిపోయిందని చెప్పారు.
దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. ‘లిటిల్ హార్ట్స్’ తరహాలో ‘DNK’ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో చిన్న సినిమా నుంచి పెద్ద విజయంగా ఎదగాలని ఆకాంక్షించారు. మౌళి, సుస్మిత శెట్టి జోడీ ఆకట్టుకుంటుందని, ట్రైలర్, పాటలు బాగున్నాయని ప్రశంసించారు.
* కొత్త నటీనటులను ప్రోత్సహిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ.. భారీ చిత్రాలతో పాటు కొత్త నటీనటులతో చిన్న సినిమాలను కూడా అదే ప్యాషన్‌తో నిర్మించడం మైత్రీ మూవీ మేకర్స్ ప్రత్యేకత అని అన్నారు. మౌళికి సినిమా నేపథ్యం లేకపోయినా తన ప్రతిభతో ఎదుగుతున్నాడని ప్రశంసించారు. ఈ సినిమాతో అతడికి మరింత మంచి గుర్తింపు రావాలని కోరుకున్నారు.
నటుడు అలీ మాట్లాడుతూ.. పెద్ద చిత్రాలతో పాటు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్‌ను అభినందించారు. మౌళి, దర్శకుడు ఈ సినిమాను భుజాన వేసుకుని రూపొందించారని, ఈ చిత్రం విజయం సాధిస్తే మరిన్ని చిన్న సినిమాలకు అవకాశాలు వస్తాయని అన్నారు.
* నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు
ఈ చిత్రంలో హీరోయిన్గా సుస్మిత శెట్టి నటిస్తున్నారు. ఇది ఆమెకు తొలి సినిమా. మౌళితో కలిసి పనిచేయడం మంచి అనుభవమని, ప్రేక్షకులు తమ చిత్రాన్ని ఆదరించాలని ఆమె కోరారు. సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమిల్లి ఈ సినిమాకు సంగీతం అందించారు. అలీ, రజిత, ప్రియ తదితర సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ వేడుకలో దర్శకులు బుచ్చిబాబు సానా, వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ, సాయి మార్తాండ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘DNK’ నవంబర్ 13న థియేటర్లలో విడుదల కానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

