ముంబై జట్టుపై అర్ధ శతకం సాధించిన సూర్య కుమార్ యాదవ్
* 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!
* హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
ఆకేరు న్యూస్, స్పోర్ట్స్ : భారత్ టీ20 జట్టు మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ప్రొఫెషనల్ క్రికెట్లోకి అదిరిపోయే రీతిలో రీఎంట్రీ ఇచ్చాడు. టీమిండియాలో చోటు కోల్పోయిన తర్వాత కొంతకాలంగా మైదానానికి దూరంగా ఉన్న సూర్య.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ (Syed Mushtaq Ali Trophy 2026) ద్వారా తిరిగి బరిలోకి దిగాడు. ఈ టోర్నీలో ముంబై జట్టుకు నాయకత్వం వహిస్తున్న సూర్యకుమార్.. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.
* * సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం..
కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ (Suryakumar Yadav 15 Ball Fifty) పూర్తి చేసిన సూర్య.. మొత్తంగా 21 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. శివమ్ దూబే (13 నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ముంబై విజయంలో సూర్యతో (Suryakumar Yadav 15 Ball Fifty) పాటు ముషీర్ ఖాన్ కూడా కీలక పాత్ర పోషించాడు. అతడు 24 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. అంగ్కృష్ రఘువంశీ (27), హార్దిక్ తామోర్ (22) కూడా రాణించారు.
ముంబై బ్యాటర్లు దూకుడుగా ఆడటంతో హైదరాబాద్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యం చిన్నబోయింది. కేవలం 13.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ముంబై విజయాన్ని అందుకుంది. హైదరాబాద్ బౌలర్లలో అజయ్ దేవ్ గౌడ్ 2 వికెట్లు తీయగా.. ప్రణవ్ వర్మ ఒక వికెట్ పడగొట్టాడు.
* 172 పరుగులకే హైదరాబాద్ ఆలౌట్..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. అభిరథ్ రెడ్డి 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కొడిమెల హిమతేజ 25, కెప్టెన్ చామ మిలింద్ 22 పరుగులు చేశారు.
ముంబై బౌలర్లలో మ్యాక్స్‌వెల్ స్వామినాథన్ 3 వికెట్లు పడగొట్టగా.. శివమ్ దూబే, సాయిరాజ్ పాటిల్ చెరో 2 వికెట్లు తీశారు. శార్దూల్ ఠాకూర్, అథర్వ అంకోలేకర్ తలో వికెట్ సాధించారు. చివరకు సూర్యకుమార్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ముంబై ఘన విజయాన్ని నమోదు చేసింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

