యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం
* దర్శనానికి మూడు గంటలు
ఆకేరు న్యూస్, యాదాద్రి భువనగిరి : పవిత్ర కార్తీక మాసం, ఆదివారం సెలవు కలిసి రావడంతో యాదగిరిగుట్ట (Yadagirigutta Temple) శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీ పెరగడంతో దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది.
* సత్యనారాయణ స్వామి వ్రతాలతో సందడి..
కార్తీక మాసం సందర్భంగా యాదాద్రిలో (Yadagirigutta Temple) సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు వ్రతాల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలు కలగాలని లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించారు.
* కార్తీకదీపాలు వెలిగించి మొక్కులు..
కార్తీక మాస పవిత్రతను పురస్కరించుకుని భక్తులు కార్తీకదీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి నెలకొంది. మరోవైపు వారాంతపు సెలవులు, పర్వదినాల సమయంలో యాదాద్రికి భక్తుల రాక ఎక్కువగా ఉంటుంది.
కార్తీక మాసంలో భక్తుల సౌకర్యార్థం వ్రతాలు, దర్శనాలు, రవాణా, భద్రత తదితర ఏర్పాట్లు చేసినట్లు గతంలో ఆలయ అధికారులు వెల్లడించారు. కార్తీక మాసం నేపథ్యంలో యాదగిరిగుట్టలో నెలకొన్న ఈ భక్తిభావ వాతావరణం భక్తులను ఆకట్టుకుంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.

