సైదాపూర్‌లో అలింకో శిబిరాన్ని ప్రారంభిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్
* సైదాపూర్‌లో అలింకో శిబిరం ప్రారంభం
ఆకేరు న్యూస్ సైదాపూర్ : హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉచితంగా సహాయ ఉపకరణాలు అందించేందుకు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో (ALIMCO Camp Saidapur) నిర్ధారణ శిబిరాన్ని ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో అలింకో (ALIMCO) సంస్థ సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
* ఉచితంగా సహాయ ఉపకరణాలు..
దివ్యాంగులు, వృద్ధులకు అవసరమైన సహాయ ఉపకరణాలను గుర్తించి, అర్హులైన వారికి వాటిని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ శిబిరం (ALIMCO Camp Saidapur) ద్వారా దివ్యాంగులు, వయోవృద్ధుల అవసరాలను పరిశీలించి, వారికి ఏయే సహాయ ఉపకరణాలు అవసరమో నిర్ధారించనున్నారు. అర్హత కలిగిన లబ్ధిదారులను గుర్తించి, వారి అవసరాలకు అనుగుణంగా ఉపకరణాలు అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

* అర్హులు సద్వినియోగం చేసుకోవాలి..
నడవడానికి ఇబ్బందులు ఎదుర్కొనే వృద్ధులు, శారీరక వైకల్యాలతో బాధపడుతున్న దివ్యాంగులకు అవసరమైన పరికరాలు అందిస్తున్నట్లు తెలిపారు. .దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఈ శిబిరాల ద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి అవసరమైన సహాయ ఉపకరణాలు అందించడం ద్వారా సామాజిక భద్రత, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, అలింకో సంస్థ ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అలాగే వివిధ గ్రామాల సర్పంచులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు హాజరయ్యారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

