డీఈఓకు ఫిర్యాదు చేస్తున్న విద్యార్థి, అతని తండ్రి
* డీఈఓకు తండ్రి ఫిర్యాదు
* ముక్కు నేలకు రాయించి ఎండలో నిలబెట్టారని ఆరోపణ..!
* కాలుకు తీవ్ర గాయాలయ్యాయని తండ్రి ఆవేదన..
ఆకేరు న్యూస్, జగిత్యాల : జగిత్యాల జిల్లాలోని రాయికల్లో ఉన్న విశ్వశాంతి పబ్లిక్ స్కూల్లో విద్యార్థికి (Jagtial School Student) విధించిన శిక్ష తీవ్ర వివాదానికి దారితీసింది. పాఠశాల ఫీజు చెల్లించలేదనే కారణంతో విద్యార్థిని అమానుషంగా శిక్షించారని తండ్రి ఆరోపించారు. ముక్కును నేలకు రాయించడంతో పాటు ఎండలో నిలబెట్టారని, ఈ క్రమంలో విద్యార్థి కళ్లు తిరిగి కిందపడటంతో కాలుకు తీవ్ర గాయాలయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
* ఫీజు బకాయి కారణంగా శిక్షించారని ఆరోపణ..
రాయికల్లోని విశ్వశాంతి పబ్లిక్ స్కూల్లో తన కుమారుడు, కుమార్తె చదువుతున్నారని విద్యార్థి తండ్రి తెలిపారు. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు చెల్లించలేదనే కారణంతో పాఠశాల యాజమాన్యం తన కుమారుడిని (Jagtial School Student) శిక్షించిందని ఆరోపించారు. ముక్కును నేలకు రాయించి, ఎండలో నిలబెట్టడంతో విద్యార్థి అస్వస్థతకు గురై కిందపడినట్లు వివరించారు. ఈ ఘటనలో అతడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
* పదో తరగతి పూర్తి చేసినా మార్కుల మెమో ఇవ్వలేదని ఫిర్యాదు..
పాఠశాల యాజమాన్యంపై తండ్రి చేసిన మరో ఆరోపణ కూడా చర్చనీయాంశంగా మారింది. 2024లో పదో తరగతి పూర్తి చేసిన తన కుమారుడికి ఇప్పటికీ మార్కుల మెమో ఇవ్వలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫీజు బకాయిల కారణంగా విద్యార్థులకు అవసరమైన విద్యా ధ్రువపత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
* పాఠశాలకు వెళ్లేందుకు భయపడుతున్న విద్యార్థి..
ఈ శిక్ష కారణంగా కాలుకు గాయాలైన తన కుమారుడు ప్రస్తుతం భయంతో పాఠశాలకు వెళ్లడం లేదని విద్యార్థి తండ్రి ఆవేదన వెలిబుచ్చాడు. విద్యార్థుల పట్ల ఇలాంటి చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.
* డీఈఓకు ఫిర్యాదు.. చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి..
విశ్వశాంతి పబ్లిక్ స్కూల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థి తండ్రి జిల్లా విద్యాశాఖ అధికారికి (డీఈఓ) ఫిర్యాదు చేశారు. తన కుమారుడు 2024లో పదో తరగతి పూర్తి చేసినప్పటికీ ఇవ్వని మార్కుల మెమోతో పాటు, పాఠశాల నుంచి ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ) ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
విద్యార్థికి విధించిన శిక్ష.. మార్కుల మెమో ఇవ్వలేదన్న ఆరోపణలపై విద్యాశాఖ అధికారులు విచారణ జరిపితే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం వివరణ, అధికారుల తదుపరి చర్యలు తెలియాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

