భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR ) ఉద్యోగాలకు నోటిఫికేషన్
* నవంబర్ 18 నుంచి దరఖాస్తులు..
* డిసెంబర్ 17 చివరి తేదీ
* ICARలో టెక్నికల్ పోస్టుల భర్తీ
ఆకేరు న్యూస్, డెస్క్ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR Recruitment 2026) పరిధిలోని సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో 1,393 పోస్టుల భర్తీకి వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక మండలి (ASRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్ అసిస్టెంట్ (T-3), సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (T-4) పోస్టుల కోసం ఈ నియామక ప్రక్రియ చేపట్టనుంది.
* పోస్టుల వివరాలు
మొత్తం 1,393 ఖాళీల్లో 1,254 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, 139 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. వ్యవసాయం, పశుసంవర్ధక శాస్త్రం, మత్స్యశాస్త్రం, సివిల్ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
* విద్యార్హతలు
సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యవసాయ విభాగాలకు అగ్రికల్చర్, హార్టికల్చర్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్ తదితర డిగ్రీలు అవసరం. ఇతర విభాగాలకు ఆయా పోస్టులను బట్టి సివిల్, ఎలక్ట్రికల్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, కంప్యూటర్ అప్లికేషన్స్ వంటి సంబంధిత అర్హతలు ఉండాలి.
* వయోపరిమితి
2026 డిసెంబర్ 17 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 21 సంవత్సరాలు, గరిష్ఠంగా 30 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
* దరఖాస్తు తేదీలు
ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ 2026 నవంబర్ 18 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 17, 2026. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ASRB అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అధికారిక వెబ్సైట్ : https://asrb.gov.in
అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్లో (ICAR Recruitment 2026) పోస్టుల వారీగా విద్యార్హతలు, ఇతర నిబంధనలను పరిశీలించండి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

