జంట సినిమా ప్రారంభోత్సవం
* టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదల..
* “యుద్ధం రాముడితో కాదు.. రాజ్యంతో” అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్..
* అమలాపురంలోనే సినిమా మొత్తం షూటింగ్..!
ఆకేరు న్యూస్, సినిమా : కొణిదెల పవన్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘జంట’. (Pawan Tej Konidela Janta) పాడని కుమార్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. వసుంధర ఆర్ట్స్ బ్యానర్‌పై రాజేష్ గునిశెట్టి, వీరు యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజశేఖర్ యాదవ్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యూనిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
* ‘యుద్ధం రాముడితో కాదు.. రాజ్యంతో’..
హీరో పవన్ తేజ్ కొణిదెల మాట్లాడుతూ.. ‘జంట’ (Pawan Tej Konidela Janta) సినిమాకు శుభాకాంక్షలు తెలిపిన పెద్దలకు కృతజ్ఞతలు చెప్పారు. తొలుత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయాలని భావించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లోనూ సినిమా చిత్రీకరణలు జరగాలనే ఉద్దేశంతో అమలాపురాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు.

సినిమా మొత్తం ఇక్కడే చిత్రీకరించనున్నట్లు వెల్లడించారు. గత రెండేళ్లుగా దర్శకుడు రాజశేఖర్ యాదవ్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నామని చెప్పారు. ఇతర సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ ‘జంట’ కోసం ఎదురుచూశానని, బలమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో మంచి ఎమోషనల్ డ్రైవ్‌తో పాటు మాస్ ఎలిమెంట్స్ ఉంటాయని తెలిపారు.
ఈ సినిమా క్యాప్షన్ ‘యుద్ధం రాముడితో కాదు.. రాజ్యంతో..’ అని వెల్లడించారు. ఈ క్యాప్షన్ చూసి చాలామంది ఫోన్లు చేస్తున్నారని, కథకు ఇది సరిగ్గా సరిపోతుందని చెప్పారు. ‘జంట’తో బ్లాక్‌బస్టర్ అందుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
* అమలాపురంలో షూటింగ్ జరగడం సంతోషం : ఎమ్మెల్యే ఆనందరావు
అమలాపురం (Amalapuram) ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ.. ఆహ్లాదకరమైన వాతావరణానికి పేరుగాంచిన అమలాపురంలో సినిమా షూటింగ్ (Pawan Tej Konidela New Movie) ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. స్థానికంగా మరిన్ని సినిమా చిత్రీకరణలు జరగాలని ఆకాంక్షించారు.

అలా జరిగితే ప్రాంతంలోని ప్రజలకు ఉపాధి, ఆదాయ అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. హైదరాబాద్‌లో స్టూడియోలు ఉన్నట్లే, అమలాపురంలోని సహజమైన లొకేషన్లను ఒక నేచర్ స్టూడియోగా చెప్పుకోవచ్చని అభిప్రాయపడ్డారు. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నారు.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు మాట్లాడుతూ.. గతంలో ‘దసరా బుల్లోడు’తో పాటు ఎన్నో సినిమాల షూటింగ్‌లు ఈ ప్రాంతంలో జరిగాయని గుర్తుచేశారు. ‘జంట’ చిత్రీకరణకు అమలాపురాన్ని ఎంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. పవన్ తేజ్ కొణిదెలకు ఇది హీరోగా రెండో సినిమా అని, ఈ చిత్రంతో మెగా ఫ్యామిలీలో మరో పెద్ద హీరోగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
* రెండేళ్లుగా ఈ కథపై పనిచేస్తున్నాం: నిర్మాత రాజేష్ గునిశెట్టి
నిర్మాత రాజేష్ గునిశెట్టి మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం రెండేళ్లుగా పనిచేస్తున్నామని తెలిపారు. కథకు అనుగుణంగా అమలాపురం ప్రాంతంలోని లొకేషన్లు సరిపోతాయని భావించి ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు.
తాము అమలాపురానికి చెందిన నిర్మాతలమని, తమ సినిమా ఇక్కడే చిత్రీకరణ జరుపుకోవడం ప్రత్యేక ఆనందాన్ని ఇస్తోందన్నారు. దర్శకుడు రాజశేఖర్ యాదవ్ మాత్రమే ఈ స్క్రిప్ట్‌ను సమర్థంగా తెరకెక్కించగలరని నమ్ముతున్నట్లు తెలిపారు. ఈ సినిమాతో టాలీవుడ్‌కు ఒక యూనిక్, క్రియేటివ్ దర్శకుడు పరిచయం కాబోతున్నారని అన్నారు.

* కొత్త తరహా యాక్షన్ చూడబోతున్నారు : ఫైట్ మాస్టర్
ఫైట్ మాస్టర్ గౌరీ శంకర్ వి.వి. మాట్లాడుతూ.. దర్శకుడు కథ చెప్పినప్పుడే ఈ సినిమాకు పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఒక యుద్ధం ఊరి మీదకు వస్తే ఎలాంటి పరిస్థితులు, భావోద్వేగాలు ఉంటాయో స్క్రిప్ట్‌లో చూశానని చెప్పారు. సినిమాలో ప్రేక్షకులు కొత్త తరహా యాక్షన్‌ను చూడబోతున్నారని పేర్కొన్నారు.
సినిమాటోగ్రాఫర్ రాహుల్ శ్రీ వాస్తవ్ మాట్లాడుతూ.. అమలాపురంలో రెండు నెలల పాటు షూటింగ్ జరగనుందని, స్థానికుల సహకారం కావాలని కోరారు. దర్శకుడు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని తెలిపారు.
* హీరోయిన్గా పాడని కుమార్ పరిచయం..
హీరోయిన్ పాడని కుమార్ మాట్లాడుతూ.. ‘జంట’ తన తొలి తెలుగు సినిమా అని, ఈ చిత్రంలో అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సినిమా కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. షూటింగ్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు.
ఈ చిత్రంలో కొణిదెల పవన్ తేజ్, పాడని కుమార్‌తో పాటు అరుణ్ పాండియన్, కల్పలత, నవీన్ నేని, అశోక్, శ్రావణ సంధ్య తదితరులు నటిస్తున్నారు. అమలాపురం పరిసర ప్రాంతాల్లో రెండు నెలల పాటు చిత్రీకరణ జరిపి, సినిమా మొత్తం అక్కడే షూట్ చేయాలని మేకర్స్ ప్రణాళిక రూపొందించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

