High Movie
* గ్యాంగ్ పరిచయంతో ఫుల్ జోష్!
* నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు సినిమా
* ఆకట్టుకుంటున్న ఎనర్జిటిక్ లిరికల్ వీడియో
ఆకేరు న్యూస్, సినిమా: దర్శకుడిగా ఎస్. కృష్ణ పరిచయం అవుతున్న చిత్రం ‘హై’ (High). ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన ‘సూపర్ 5’ (Super 5) లిరికల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమాలోని గ్యాంగ్‌ను పరిచయం చేస్తూ సాగే ఈ పాట క్యాచీ బీట్స్, ఎనర్జిటిక్ మ్యూజిక్‌తో సందడి చేస్తోంది.
గ్యాంగ్‌ను పరిచయం చేస్తూ ప్రత్యేక పాట
ఇప్పటికే ‘హై’ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన లభించింది. తాజాగా విడుదలైన ‘సూపర్ 5’ పాట కూడా అదే జోష్‌ను కొనసాగిస్తోంది. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. వికాస్ బడిస అందించిన సంగీతం, అద్వైత్ ఎనర్జిటిక్ గానం మరింత ఉత్సాహాన్ని నింపాయి. పిల్లల కోరస్ పాటకు అదనపు ఆకర్షణగా నిలిచింది.
దర్శకుడిగా ఎస్. కృష్ణ పరిచయం
అనిల్ రావిపూడితో కలిసి పనిచేయడంతో పాటు పలు విజయవంతమైన చిత్రాలకు సహ రచయితగా వ్యవహరించిన ఎస్. కృష్ణ.. ‘హై’ సినిమాతో దర్శకుడిగా, రచయితగా, నటుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇమేజ్‌స్పార్క్ ఎంటర్టైన్మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హరీష్ పెద్ది, శేఖర్ దివ్వెలతో కలిసి ఎస్. కృష్ణ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
భావోద్వేగాలు, ఆసక్తికరమైన డ్రామా, ఎనర్జీతో కూడిన సన్నివేశాలతో ప్రేక్షకులకు ప్రత్యేకమైన సినిమా అనుభూతిని అందించడమే లక్ష్యంగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
తారాగణం, సాంకేతిక బృందం
ఈ చిత్రంలో అనన్య శర్మ, ఎస్. కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మల్లు నాయక్, సునీల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వికాస్ బడిస సంగీతం సమకూరుస్తుండగా.. జీఆర్కే శరణ్ రావుల ఎడిటర్‌గా, వి. వెంకట్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
నవంబర్ 27న థియేటర్లలోకి ‘హై’
వరుసగా పాటలను విడుదల చేస్తూ చిత్రంపై అంచనాలను పెంచుతున్న మేకర్స్.. తాజాగా ‘సూపర్ 5’ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రాన్ని నవంబర్ 27న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

