ఈరమళ్ల సాయితేజ (ఫైల్ ఫోటో)
* వారం రోజుల క్రితమే కొత్త ఉద్యోగం సాధించిన యువకుడు
* జింకను ఢీకొని ఆగిన కారు.. వెనుక నుంచి ట్రక్కు ఢీ
* మునుగోడులో విషాదఛాయలు
ఆకేరు న్యూస్, డెస్క్ : ఉన్నత చదువుల కోసం అమెరికా (USA) వెళ్లిన తెలంగాణ యువకుడు రోడ్డు ప్రమాదంలో (New York Road Accident) ప్రాణాలు కోల్పోయాడు. న్యూయార్క్లో జరిగిన ఈ ప్రమాదంలో (New York Road Accident) నల్గొండ జిల్లా మునుగోడుకు చెందిన ఈరమళ్ల సాయితేజ (25) మృతి చెందాడు. వారం రోజుల క్రితమే కొత్త ఉద్యోగం (New Job) సాధించిన యువకుడు ఇలా అర్ధాంతరంగా మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
* జింకను ఢీకొని ఆగిన కారు.. వెనుక నుంచి ట్రక్కు ఢీ
వివరాల్లోకి వెళ్తే.. మునుగోడుకు చెందిన ఈరమళ్ల ప్రసాద్, శ్రీకన్య దంపతుల పెద్ద కుమారుడు సాయితేజ. ఉన్నత చదువుల కోసం కొంతకాలం క్రితం అమెరికా వెళ్లిన ఆయన అక్కడ చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితమే అతడికి ఉద్యోగం లభించింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవడంతో ఇంట్లో ఆనందం నెలకొంది.
అయితే, కొత్త ఉద్యోగంలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో సాయితేజ ప్రయాణిస్తున్న కారుకు అకస్మాత్తుగా జింక అడ్డుగా వచ్చింది. దీంతో కారు అదుపుతప్పి జింకను ఢీకొని రోడ్డుపై ఆగిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన సరుకు రవాణా ట్రక్కు (Truck) ఆగి ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయితేజ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
* కుటుంబంలో తీరని విషాదం..
సాయితేజ స్నేహితుల ద్వారా కుమారుడి మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వారం రోజుల క్రితమే ఉద్యోగం వచ్చిందని సంతోషించిన కుటుంబానికి ఇంతలోనే కుమారుడి మరణవార్త వినాల్సి రావడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
కుటుంబానికి అండగా నిలుస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న పెద్ద కుమారుడు ఇలా అర్ధాంతరంగా దూరం కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో మునుగోడు ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Also : వరంగల్ రూపురేఖలు మారనున్నాయా?

Please tell us what is wrong. Your report will be sent to the website team.

