ICMR Recruitment 2026
* పీజీ పాసై 40 ఏళ్లలోపు వారికి ఛాన్స్
* నెలకు రూ.88 వేల జీతం..
ఆకేరు న్యూస్, డెస్క్: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న పీజీ అర్హత కలిగిన అభ్యర్థులకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) శుభవార్త అందించింది. ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్-II (మెడికల్/నాన్ మెడికల్) పోస్టు భర్తీకి నోటిఫికేషన్ (ICMR Recruitment 2026) విడుదల చేసింది. మొత్తం ఒక పోస్టును భర్తీ చేయనున్నారు. గరిష్ఠంగా 40 ఏళ్ల వయస్సు ఉన్న అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులకు డిసెంబర్ 10, 2026 చివరి తేదీగా నిర్ణయించారు.
* పోస్టు వివరాలు
ICMR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఉమెన్స్ హెల్త్ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా వాణి ప్రాంతంలో ఉన్న మోడల్ రూరల్ హెల్త్ రీసెర్చ్ యూనిట్లో ఈ పోస్టును భర్తీ చేయనున్నారు. ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్-II పోస్టుకు మెడికల్ లేదా నాన్ మెడికల్ విభాగంలో అభ్యర్థిని ఎంపిక చేస్తారు.
* పీజీ, పీహెచ్డీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్..
మెడికల్ విభాగానికి MBBSతో పాటు మూడేళ్ల అనుభవం లేదా MBBSతో పీజీ డిగ్రీ (MD/MPH లేదా సమానమైన అర్హత) లేదా MBBSతో పీహెచ్డీ ఉండాలి. నాన్ మెడికల్ విభాగానికి లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, బయోస్టాటిస్టిక్స్ లేదా సోషల్ సైన్సెస్‌లో పీజీ డిగ్రీతో పాటు మూడేళ్ల పని అనుభవం ఉండాలి. లేదా సంబంధిత విభాగాల్లో పీహెచ్డీ అర్హత కలిగి ఉండాలి.
*వయోపరిమితి..
ఈ ఉద్యోగానికి గరిష్ఠ వయోపరిమితి 40 సంవత్సరాలుగా నిర్ణయించారు. పూర్తి అర్హతలు, ఇతర నిబంధనలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించాలి.
*జీతం ఎంతంటే..
ఎంపికైన మెడికల్ అభ్యర్థికి నెలకు రూ.80,000తో పాటు 10 శాతం HRA కలిపి మొత్తం రూ.88,000 చెల్లిస్తారు. నాన్ మెడికల్ అభ్యర్థికి నెలకు రూ.67,000తో పాటు 10 శాతం HRA అందిస్తారు.
*ఎంపిక విధానం
అభ్యర్థుల దరఖాస్తులను విద్యార్హతలు, అనుభవం ఆధారంగా పరిశీలిస్తారు. అర్హులైన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఆన్లైన్ ఇంటర్వ్యూ లేదా వ్యక్తిగత చర్చ ద్వారా ఎంపిక చేస్తారు.
*దరఖాస్తు చివరి తేదీ..
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 10, 2026లోగా ఆన్లైన్లో (ICMR Recruitment) దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగం మొదట ఏడాది కాలానికి తాత్కాలిక ప్రాతిపదికన ఉంటుంది. పనితీరు, నిధుల లభ్యత ఆధారంగా పొడిగించే అవకాశం ఉంది.
దరఖాస్తు వెబ్సైట్: https://gad-hrms.frevo.co.in/careers
అధికారిక వెబ్సైట్: https://nirwoh.icmr.org.in/
Also Read : ఎస్ఎస్సీ నోటిఫికేషన్ విడుదల..

Please tell us what is wrong. Your report will be sent to the website team.

