రాయపర్తి మండలంలోని ఊకల్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీల మహాసభ
* వర్గీకరణ ఫలాలను మాదిగ విద్యార్థులు అందిపుచ్చుకోవాలి.
* వంగూరి ఆనందరావు మాదిగ
ఆకేరు న్యూస్, రాయపర్తి : నేటి పోటీ ప్రపంచంలో మాదిగ విద్యార్థినీ, విద్యార్థులు విజ్ఞానవంతులుగా ఎదిగి సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి విద్య (Education) ఒక్కటే ఏకైక రాజమార్గమని ఎమ్మార్పీఎస్ (MRPS), ఎంఎస్పీ (MSP) జాతీయ నాయకులు, వరంగల్ జిల్లా ఇంచార్జి వంగూరి ఆనందరావు మాదిగ (Vanguri Anand Rao) అన్నారు. శనివారం రాయపర్తి మండలంలోని ఊకల్ గ్రామంలో మండల అధ్యక్షుడు వషపాక కుమార్ మాదిగ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ మాదిగ విద్యార్థి సమైక్య (MSF), ఎమ్మార్పీఎస్ గ్రామ సంస్థాగత నిర్మాణ కమిటీల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
* చదువుపైనే ఏకాగ్రత పెట్టాలి..
ఈ సందర్భంగా ఆనందరావు మాదిగ (Vanguri Anand Rao) మాట్లాడుతూ.. విద్యార్థులు చెడు వ్యసనాలు, ఆకర్షణలకు దూరంగా ఉంటూ చదువుపైనే ఏకాగ్రత (Concentration) సారించాలని సూచించారు. గతంలో బడుగు, బలహీన వర్గాలకు అక్షరజ్ఞానం నిరాకరించబడిందని గుర్తు చేశారు. విశ్వజ్ఞాని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ద్వారా నేడు అన్ని వర్గాల ప్రజలకు విద్య, ఉద్యోగ, సంక్షేమ రంగాల్లో సమాన అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు.
విద్యలో రాణించలేకపోతే సమాజంలో సముచిత స్థానం, ఆత్మగౌరవం దక్కవని అన్నారు. అక్షరాస్యత, విద్య ద్వారా మాత్రమే సమాజంలో గౌరవాన్ని పొందగలమని స్పష్టం చేశారు.
* వర్గీకరణ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలి..
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ జాబితాలోని 59 ఉపకులాలకు సమాన న్యాయం, రిజర్వేషన్ (Reservation) ఫలాలు దక్కాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై దశాబ్దాలుగా పోరాటాలు నిర్వహించామని ఆనందరావు మాదిగ తెలిపారు.
ఈ పోరాటాల ఫలితంగానే ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ద్వారా చట్టబద్ధత సాధించుకున్నామని పేర్కొన్నారు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న వర్గీకరణ ఫలాలను మాదిగ, మాదిగ ఉపకులాలతో పాటు ఎస్సీ జాబితాలోని 59 కులాల విద్యార్థినీ, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
విద్య, ఉద్యోగ, పాలనా రంగాల్లో అగ్రగామిగా నిలిచి ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
* నూతన గ్రామ కమిటీల ఏకగ్రీవ ఎన్నిక..
అనంతరం ఊకల్ గ్రామ మాదిగ విద్యార్థి సమైక్య (MSF), మహిళా విద్యార్థిని సమైక్య నూతన కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మాదిగ విద్యార్థి సమైక్య కమిటీ అధ్యక్షుడిగా సోమారపు అరవింద్ మాదిగ, అధికార ప్రతినిధిగా కందుకూరి సునీల్ మాదిగ, ఉపాధ్యక్షులుగా కొండగడుపుల క్రాంతి మాదిగ, పోలెపాక శ్రీకాంత్ మాదిగ, ప్రధాన కార్యదర్శులుగా కందుకూరి రాజు మాదిగ, బూడిద శివకుమార్ మాదిగ, కార్యదర్శిగా బూడిద నాగరాజు మాదిగ, సహాయ కార్యదర్శిగా అభిలాష మాదిగ ఎన్నికయ్యారు. రాయపర్తి మండల ఇంచార్జి కోడూరి రాజు మాదిగ, మండల ఎంఎస్పీ కన్వీనర్ బచ్చలి ఏకయ్య మాదిగ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
* మహిళా విద్యార్థిని సమైక్య కమిటీ..
మహిళా విద్యార్థిని సమైక్య అధ్యక్షురాలిగా పోలేపాక రక్షిత మాదిగ, అధికార ప్రతినిధిగా ఇమ్మడి ఐశ్వర్య మాదిగ, ఉపాధ్యక్షులుగా నకిరేకంటి వర్షిని మాదిగ, పోలెపాక మానస మాదిగ, ప్రధాన కార్యదర్శిగా ఇమ్మడి మణి మాదిగ, కార్యదర్శిగా కందుకూరి రాజు మాదిగ, సహాయ కార్యదర్శిగా బొమ్మకంటి నిహారిక మాదిగ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
గ్రామ కమిటీల నిర్మాణ సదస్సులో ఊకల్ గ్రామానికి చెందిన మాదిగ పెద్దలు, మహిళలు, యువకులు, విద్యార్థినీ, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also : శాస్త్రీయ దృక్పథానికి ‘చెకుముకి’ పోటీలు..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

