కలెక్టర్ స్నేహ శబరిష్
* వార్డు ఆఫీసర్పై సస్పెన్షన్ వేటు!
ఆకేరు న్యూస్, తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో పేదల సొంతింటి కలను ఆసరాగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగిపై జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ కఠిన చర్యలు తీసుకున్నారు. పట్టణంలోని 1, 9వ వార్డుల వార్డు ఆఫీసర్గా పనిచేస్తున్న జె. మనేశ్వర్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
* లబ్ధిదారుల నుంచి అక్రమ వసూళ్లు..
రెండు పడక గదుల ఇళ్ల (Double Bedroom Houses) కేటాయింపు విషయంలో సదరు అధికారి లబ్ధిదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
* డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు..
ప్రభుత్వ పథకాల అమలులో భాగంగా లబ్ధిదారుల నుంచి ఒక్క రూపాయి వసూలు చేసినా సంబంధిత ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. రెండు పడక గదుల ఇళ్లు (Double Bedroom Houses), ఇందిరమ్మ ఇళ్లు లేదా ఇతర ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తామని ఎవరైనా దళారులు లేదా అధికారులు మాయమాటలు చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తే భయపడకుండా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
* పారదర్శకంగా పనిచేయాలి..
ప్రభుత్వ ఉద్యోగులందరూ నిస్వార్థంగా, పారదర్శకంగా, బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పథకాల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Also Read : అణగారిన వర్గాలపై దాడులను సహించేది లేదు..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

