మాట్లాడుతున్న డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
* నిందితులపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి
* డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ డిమాండ్
ఆకేరు న్యూస్, సిద్దిపేట : ఆధునిక సమాజంలోనూ దళితులపై కొనసాగుతున్న కులవివక్ష, అమానుష దాడులను ఇకపై ఏమాత్రం సహించేది లేదని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. ఇలాంటి ఘటనలపై ప్రజాస్వామ్యబద్ధంగా తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.
* సిద్దిపేటలో ముఖ్య నాయకుల సమావేశం..
మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న కులవివక్ష ఘటనలు (Caste Discrimination Incidents), దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నల్గొండలో దళిత మహిళా కార్మికురాలిపై (Dalit Rights) దాడి, యాదాద్రిలో బతుకమ్మ ఆడే సమయంలో వివక్ష, మహబూబ్‌నగర్‌లో ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఇల్లు కూల్చివేత, పెగడపల్లిలో బోనం ఎత్తుకున్నందుకు దాడి వంటి ఘటనలు నాగరిక సమాజానికే మాయని మచ్చ అని అన్నారు. వీటితో పాటు కరీంనగర్, మెదక్, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో జరుగుతున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
* దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోంది..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్చార్జి బి.ఎం. సందీప్, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కులాలు, మతాలను సమానంగా చూస్తూ దళితుల అభ్యున్నతి (Dalit Welfare) కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు.
అయితే, కొందరు స్వార్థపరులు కావాలనే కులమతాల మధ్య చిచ్చుపెట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం బాధాకరమని అన్నారు.
* అట్రాసిటీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలి
దళితులపై దాడులు జరిగితే చేతులు కట్టుకుని మౌనంగా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని రామకృష్ణ స్పష్టం చేశారు. ప్రతి ఘటనపై మాదిగ హక్కుల దండోరా ప్రజా సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తుందని తెలిపారు.
కులం పేరుతో అవమానించే పదజాలం ఉపయోగించినా, దాడులకు పాల్పడినా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం (SC/ST Atrocities Act) కింద కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ, పోలీస్ అధికారులను డిమాండ్ చేశారు. బాధ్యులను తక్షణమే అరెస్ట్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
* కులవివక్ష లేని సమసమాజమే లక్ష్యం..
కులవివక్షకు తావులేని సమసమాజ నిర్మాణమే తమ లక్ష్యమని రామకృష్ణ తెలిపారు. రాష్ట్రంలో దళితులకు (Dalit Rights ) ఏ కష్టం వచ్చినా, ఎక్కడ అన్యాయం జరిగినా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
బాధితులు ఎప్పుడైనా తమను నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ (8309204121), రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ (9849485100) నంబర్లను సంప్రదించాలని కోరారు.
Also Read : పాలకుర్తిలో ఫార్మసిస్టులకు ఘన సన్మానం..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

