కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్
* కలెక్టర్, సీపీ పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణ
* హన్మకొండలో SOMI ఆధ్వర్యంలో కార్యక్రమం
ఆకేరు న్యూస్, వరంగల్ : ప్రసవ విధానాలపై ప్రస్తుత కాలంలో నెలకొంటున్న అపోహలు, సందేహాలను తొలగించడంతో పాటు సహజ ప్రసవాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వైద్య రంగ నిపుణులు సూచించారు. ఈ నేపథ్యంలో హన్మకొండలో SOMI ఆధ్వర్యంలో సహజ ప్రసవాలపై అవగాహన వాక్ (Natural Birth Awareness Walk) నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్, సీపీ పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
* ఆరోగ్య పరిస్థితిని బట్టి ప్రసవ విధానం..
ప్రతి గర్భిణి ఆరోగ్య పరిస్థితి, వైద్యపరమైన అవసరాలను బట్టి ప్రసవ విధానాన్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుందని నిపుణులు తెలిపారు. సహజ ప్రసవం (Natural Birth) సాధ్యమయ్యే సందర్భాల్లో తగిన వైద్య పర్యవేక్షణ, మిడ్వైఫరీ (Midwifery) సేవలు, కుటుంబ సభ్యుల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు.
* తల్లులు, శిశువుల ఆరోగ్యంపై అవగాహన..
ఈ కార్యక్రమం ద్వారా సహజ ప్రసవాలపై అవగాహన (Natural Birth Awareness Walk) పెంచడంతో పాటు మిడ్వైఫ్స్ సేవల ప్రాధాన్యతను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. తల్లుల ఆరోగ్యం, సురక్షిత ప్రసవాలు, నవజాత శిశువుల సంరక్షణపై సమాజంలో మరింత చైతన్యం తీసుకురావడమే కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
Also Read : డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో దందా..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

