పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత మెగా వైద్య శిబిరం
* మెగా వైద్య శిబిరానికి పకడ్బందీ ఏర్పాట్లు
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ నెల 28న గోవిందరావుపేట మండలంలోని పీఎస్ఆర్ గార్డెన్లో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత మెగా వైద్య శిబిరం (Mega Medical Camp) ఏర్పాట్లను జిల్లా ఎస్పీ (SP) సుధీర్ రామ్నాథ్ కేకన్ బుధవారం పరిశీలించారు. సంబంధిత అధికారులతో కలిసి శిబిరం నిర్వహించే ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న ఈ బృహత్తర కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. వైద్య శిబిరానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా వైద్యులను, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ రవీందర్, ట్రైనీ డీఎస్పీలు సాయి, మహేష్ గౌడ్, సాయి విశ్వంత్, ఎస్బీ ఇన్స్పెక్టర్ ప్రతాప్, పస్రా సీఐ దయాకర్, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

