నరేష్ (ఫైల్ ఫోటో)
* వెంకటాపురం మండలంలో దారుణం..
ఆకేరు న్యూస్, ములుగు : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను భార్య ప్రియుడితో కలిసి హత్య (Mulugu Murder) చేసినట్లు పోలీసులు తెలిపారు.
* డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఘటన..
వెంకటాపురం మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ ఇంటిలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. బెస్తగూడెం గ్రామానికి చెందిన గుండారం సత్యంతో కలిసి భార్య తన భర్త నరేష్‌ను హత్య (Mulugu Murder) చేసినట్లు తెలుస్తోంది.
* ఉరితాడు బిగించి హత్య..
అక్రమ సంబంధానికి భర్త నరేష్ అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య, సత్యం కలిసి అతడికి ఉరితాడు బిగించి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనపై స్థానికంగా కలకలం రేగింది.
* కేసు నమోదు చేసిన పోలీసులు..
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు దారితీసిన పరిస్థితులు.. నిందితుల పాత్రపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

