Aalochana Movie Poster
* సీనియర్ సిటిజన్లకు బంపర్ ఆఫర్..!
ఆకేరు న్యూస్, సినిమా : వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ‘ఆలోచన’ (Aalochana Movie) సినిమా స్పెషల్ ప్రీమియర్ షోను విజయవాడలో ఘనంగా నిర్వహించేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేసింది. గురువారం సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని నవరంగ్ థియేటర్లో ఈ ప్రత్యేక ప్రదర్శన జరగనుంది.
* పలువురు సినీ ప్రముఖుల హాజరు..
‘ఆలోచన’ చిత్రానికి సురేందర్ చాచా కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం వహించారు. ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మించారు. ప్రముఖ నిర్మాత సురేష్ కొండేటికి చెందిన ఎస్కే పిక్చర్స్ (SK Pictures) ద్వారా ఈ సినిమా విడుదలవుతోంది. ప్రీమియర్ షోకు ప్రముఖ నటులు ప్రసాద్ బాబు, నరసింహరాజు, జయలలితతో పాటు చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరుకానున్నారు.
* 60 ఏళ్లు దాటితే టికెట్ ఫ్రీ..
ఈ సందర్భంగా చిత్ర బృందం సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. నవంబర్ 27, 28, 29 తేదీల్లో 60 ఏళ్లు పైబడిన మహిళలు, పురుషులు తమ ఆధార్ కార్డు చూపించి థియేటర్లలో ఉచితంగా టికెట్ పొంది సినిమాను వీక్షించవచ్చని మేకర్స్ వెల్లడించారు.
* మానవ జీవిత సారాన్ని ఆవిష్కరించే కథ..
‘‘మనిషి ఏడుస్తూనే పుడతాడు.. పోయేటప్పుడు కూడా ఏడ్చే పనులు చేస్తూనే పోతాడు.. వేయి జీవితాల పిచ్చి ఆలోచనకు ప్రతిరూపం’’ అనే ఆలోచనతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. సమాజంలోని లోతైన భావోద్వేగాలు, మానవ జీవిత సారాన్ని ఈ సినిమా (Aalochana Movie) ఆవిష్కరిస్తుందని పేర్కొంది.
* సాంకేతిక విభాగంలో ప్రముఖులు..
U/A సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రానికి వియాన్ సంగీతం అందించారు. టి. సురేంద్ర రెడ్డి సినిమాటోగ్రఫీ (Cinematography), ఆర్.ఎల్. వర్మ ఎడిటింగ్ (Editing) బాధ్యతలు నిర్వర్తించారు. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Also Read : ‘నాన్న కుట్టి’ అందరికీ నచ్చేలా ఉంటుంది..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

