కమలాపూర్ లో అధికారులు తనిఖీలు
* శివ బ్రిక్స్ ఇండస్ట్రీలో 25 మంది కార్మికుల గుర్తింపు..!
* ఆర్డీఓ కార్యాలయంలో విచారణ
*ఎఫ్ఎంఎంఎస్ ఫిర్యాదుతో స్పందించిన కలెక్టర్
ఆకేరు న్యూస్, కమలాపూర్ : హన్మకొండ జిల్లా కమలాపూర్ (Kamalapur) మండల కేంద్రంలో కార్మికుల పరిస్థితిపై జిల్లా కలెక్టర్ స్పందించారు. స్థానిక శివ బ్రిక్స్ ఇండస్ట్రీలో సుమారు 25 మంది కార్మికులు (Workers) 14 ఏళ్లుగా బానిసలుగా పనిచేస్తున్నారంటూ ఎఫ్ఎంఎంఎస్ స్వచ్ఛంద సంస్థ (FMMS NGO) ఫిర్యాదు చేసింది. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు.
*కమలాపూర్‌లో అధికారుల తనిఖీలు
కమలాపూర్ (Kamalapur) మండల కేంద్రంలోని శివ బ్రిక్స్ ఇండస్ట్రీలో రెవెన్యూ, పోలీస్, శిశు సంక్షేమ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పరిశ్రమలో పనిచేస్తున్న సుమారు 25 మంది కార్మికులను అధికారులు విచారించారు. అనంతరం వారిని హనుమకొండ ఆర్డీఓ కార్యాలయంలో హాజరుపరిచారు.
*విడుదలకు సిద్ధం చేయాలని ఆదేశాలు..
కార్మికుల పరిస్థితిపై విచారణ జరిపి, వారిని విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. కార్మికుల నుంచి వివరాలను అధికారులు సేకరించారు.
*యజమాని, కార్మికులకు నేడు హియరింగ్..
కార్మికులు, పరిశ్రమ యజమానికి హనుమకొండ ఆర్డీఓ కార్యాలయంలో నేడు హియరింగ్ (Hearing) ఏర్పాటు చేసినట్లు కమలాపూర్ తహసీల్దార్ సురేశ్ తెలిపారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read : రాజ్యాంగ పరిరక్షణే అంబేద్కర్‌కు నిజమైన నివాళి!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

