వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత
* వాకర్స్‌కు పోలీసుల కీలక విజ్ఞప్తి
ఆకేరు న్యూస్, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) ఆధ్వర్యంలో ఈ నెల 29న సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్ఐ) ఉద్యోగాల నియామకానికి నిర్వహించే ప్రిలిమినరీ రాత పరీక్ష (Preliminary Written Examination) నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధికారులు కీలక సూచనలు చేశారు.
*32 కేంద్రాల్లో ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ ట్రై సిటీ పరిధిలోని 32 పరీక్షా కేంద్రాల్లో ఈ నెల 29న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణతో పాటు భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా పరీక్షా కేంద్రాలుగా ఉన్న కళాశాలలు, పాఠశాలల మైదానాల్లో వాకర్స్‌కు (Tricity Walkers) తాత్కాలికంగా అనుమతి ఉండదు.
*28 సాయంత్రం నుంచి వాకింగ్‌కు అనుమతి లేదు..
ట్రై సిటీ పరిధిలోని వాకర్స్ ఈ నెల 28న శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 29న ఆదివారం ఉదయం వరకు కింది పరీక్షా కేంద్రాల మైదానాల్లో వాకింగ్‌కు (Tricity Walkers) రావద్దని పోలీసులు సూచించారు.
- సెయింట్ గాబ్రియేల్ హై స్కూల్, కాజీపేట
- ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, హనుమకొండ
- కాకతీయ డిగ్రీ కళాశాల, హనుమకొండ
- కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్
- లాల్ బహదూర్ కళాశాల, వరంగల్
- ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, వరంగల్
*పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి..
పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ చేపడుతున్న భద్రతా చర్యలకు వాకర్స్‌తో పాటు ప్రజలందరూ సహకరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు.
Also Read : రాజ్యాంగ పరిరక్షణే అంబేద్కర్‌కు నిజమైన నివాళి!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

