Jakkanna Mahabub Reddy,
* నిరుపేద కుటుంబాలకు నిరంతరం అండ
* తొర్రూరు మండలంలో ప్రత్యేక గుర్తింపు
ఆకేరు న్యూస్, తొర్రూరు : రాజకీయమంటే కేవలం పదవులు అనుభవించడం కాదని.. కష్టాల్లో ఉన్న పేదల కన్నీరు తుడవడమే నిజమైన ప్రజాసేవ అని మడిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర మాజీ కోశాధికారి జక్కన్న మహబూబ్ రెడ్డి (Jakkanna Mahabub Reddy) నిరూపిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని ఏ గ్రామంలో నిరుపేద కుటుంబాలకు ఆపద వచ్చినా ‘నేనున్నానంటూ’ ముందుకొచ్చి తన వంతు సహాయం అందిస్తున్నారు.
* నిరుపేదలకు నిరంతరం అండగా..
తొర్రూరు మండలంలో ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగినా, కుటుంబ పెద్దను కోల్పోయి నిరుపేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నా మహబూబ్ రెడ్డి (Jakkanna Mahabub Reddy) తక్షణమే స్పందిస్తున్నారు. అంత్యక్రియల ఖర్చుల నుంచి బాధిత కుటుంబాలు కోలుకునే వరకు తన వంతు ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
అలాగే ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేదలకు వైద్య ఖర్చుల కోసం సాయం చేయడం, నిరుపేద ఆడబిడ్డల వివాహాలకు చేయూతనివ్వడం, పేద విద్యార్థులకు అండగా నిలవడం వంటి సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఏ గ్రామంలో ఆపద వచ్చినా, అర్ధరాత్రి అయినా బాధితుల వద్దకు చేరుకుని భరోసా కల్పిస్తున్నారు. దీంతో తొర్రూరు మండల ప్రజల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది.
* మడిపల్లిలో బాధిత కుటుంబాలకు పరామర్శ
ఇదే సేవా స్ఫూర్తితో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం మడిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు.
గ్రామానికి చెందిన చిలుక నవదీప్ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని నాయకులు పరామర్శించారు. నవదీప్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జక్కన్న మహబూబ్ రెడ్డి, తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జక్కా ఇంద్రసేన రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి తక్షణ ఆర్థిక సాయంగా రూ.3,000 అందించారు.
* అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సాయం
అదే గ్రామానికి చెందిన ఏర్పుల యాకన్న, దోనుక రజిత, ఏర్పుల సంధ్య ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలుసుకున్న నాయకులు వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి సహకారంతో నిరుపేద, బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వపరంగా అందాల్సిన సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబాలకు అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
* కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు..
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడిల మాధవి సాయిలు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెన్నం సోమిరెడ్డి, పార్టీ సెక్రటరీ వల్లంల వెంకటేశ్వర్లు, నాయకులు మహంకాళి సంపత్, చామకూరి మహబూబ్ రెడ్డి, యర్రం రాజు యాదవ్, వేర్పుల బిక్షం, వేర్పుల వెంకన్న, పుల్లూరి చంద్రు, కొండేటి చరణ్, దాసరి ప్రభాకర్, మహంకాళి చంద్రు, మహంకాళి స్వామి, ఉప్పలమ్మ, కొండేటి దర్గా స్వామి, మహంకాళి సురేష్, కొండేటి ముత్తయ్య, కొండేటి బాబు, పుల్లూరి కార్తీక్, నగరగంటి సుమన్, వేర్పుల ఎల్లమ్మ, ఏర్పుల సుగుణమ్మ, కొండేటి ఎల్లమ్మ, కొండవీటి సోమక్కతో పాటు గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read : కొత్త తరహా క్రెడిట్ కార్డ్ మోసం..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

