* హైదరాబాద్ నగరం వనస్థలిపురంలో ఘటన
ఆకేరున్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో నిర్లక్ష్యంగా వస్తున్న కారు మహిళను ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ గాల్లోకి ఎగిరిపడింది. ప్రమాదానికి సంబంధించిన ఫుటేజ్ సీసీటీవీలో రికార్డైంది. గాయపడిన మహిళను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారును గుర్తించామని, డ్రైవర్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని వనస్థలిపురం ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి వెల్లడించారు.