హనుమకొండ: హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం (02/09/2024 రోజున ) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ( గ్రీవెన్స్ డే ) రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు కురుస్తుండగా వివిధ శాఖల అధికారులు సహాయక చర్యలు, విధులలో నిమగ్నమై ఉన్నందున సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. వచ్చే సోమవారం యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
————————–