* వరద బాధితుల కోసం ఒకరోజు వేతనం అందజేత
ఆకేరున్యూస్, హైదరాబాద్: వర్షపు బాధితులకోసం ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉదారతను చాటుకున్నారు. వరద బాధితులకు సహాయంగా ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్టు ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ లచ్చిరెడ్డి ప్రకటించారు. రూ.100కోట్ల విరాళాలు ప్రభుత్వానికి అందజేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ నిధులతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని, వారికి మౌలిక వసతులు, తాగునీరు, ఆహారం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.