* పోలీసులకు, మావోలకు మధ్య కాల్పులు
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరుగురు మావోలు హతం
* ఇద్దరు పోలీసులకు గాయాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :తెలంగాణ(TELANGANA) రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం(BHADRADRI KOTHAGUDEM) జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావో్యిస్టులు (MAOISTS)మృతి చెందారు. మరికొంతమందికి గాయాలు అయ్యాయి. ఇద్దరు పోలీసులకు కూడా గాయాలు అయ్యాయి. గాయపడిన మావోయిస్టులను పోలీసులు మణుగూరు ఆస్పత్రికి తరలించారు. కాగా, చనిపోయిన మావోయిస్టులు లచ్చన్న దళానికి (LACHANNA DALAM) చెందినవారుగా పోలీసులు భావిస్తున్నారు. వారిలో లచ్చన్న కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.