* 1000 మంది పోలీసులతో భద్రత
* అమల్లో 144 సెక్షన్
* ఇరువర్గాల మధ్య ఘర్షణల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం
* ఇంటర్నెట్ సర్వీసులు బంద్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కొమురంభీం అసిఫాబాద్ జిల్లా (KOMRAMBHEEM ASIFABAD DISTRICT)జైనూర్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో 1000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇంటర్నెట్ సర్వీసులను(INTERNET SURVICES) సైతం నిలిపివేశారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సోషల్మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం(SP GOUS ALAM) కోరారు. ఓ ఆదివాసీ మహిళపై వేరొక వర్గానికి చెందిన ఆటోడ్రైవర్ లైంగికదాడి, హత్యాయత్నానికి పాల్పడడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఆదివాసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి.