* వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
ఆకేరు న్యూస్, విజయవాడ : ఆంధ్రప్రదేశ్(ANDHRAPRADESH)లో వరద విపత్తును అంచనా వేయడానికి కేంద్ర బృందం(CENTRAL TEAM) విచ్చేసింది. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తోంది. పర్యటనకు ముందు కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్షించింది. కృష్ణా(KRISHNA), గుంటూరు(GUNTUR), ప్రకాశం(PRAKASAM) జిల్లాలో కేంద్ర బృందం పర్యటించనుంది. ఈ బృందానికి కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వం వహిస్తున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా వాటిల్లిన నష్టం అంచనాకు ఈ బృందం పర్యటిస్తున్నది. నేరుగా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించడంతో పాటు వరద బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇవ్వనుంది. ఆ సందర్భంగా భారీ వర్షాలు, వరదల పరిస్థితిని అధికారులు కేంద్ర బృందానికి వివరించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
