* దుబ్బాకలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ ఎస్
* ఇరు పార్టీ కార్యకర్తల ఘర్షణ
ఆకేరు న్యూస్, సిద్దిపేట : సిద్దిపేట జిల్లా దుబ్బాక టౌన్(Dhubbaka Town) కాంగ్రెస్, బీఆర్ ఎస్ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నేతల విగ్రహాల ఏర్పాటులో ఇరు పార్టీ కార్యకర్తల మధ్య వివాదం తలెత్తింది. మాజీ మంత్రి దివంగత చెరుకు ముత్యం రెడ్డి(Cheruku Mutyam Reddy) విగ్రహ ఏర్పాటుకు కాంగ్రెస్ (Congress)శ్రేణులు భూమి పూజ చేయడానికి శుక్రవారం ఉదయం పార్టీ కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. ఇది వరకు అదే స్థానంలో బీఆర్ ఎస్(Brs) మాజీ ఎమ్మెల్యే దివంగత సోలిపేట(Solipeta) విగ్రహ ఏర్పాటుకు ఆ పార్టీ భూమి పూజ చేసింది. ఈ క్రమంలో అక్కడ కాంగ్రెస్ నేత విగ్రహ ఏర్పాటును బీఆర్ఎస్ వ్యతిరేకిస్తూ ఆందోళన మొదలుపెట్టింది. దానికి పోటీగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు. ఇరు పార్టీ కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో దుబ్బాక టౌన్ హోరెత్తింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేస్తున్నారు.
———————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
