Jakka Mahaboob Reddy
Jakka Mahaboob Reddy: ఆకేరు న్యూస్, తొర్రూరు: మడిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ జక్కా మహబూబ్ రెడ్డి పదవులకు అతీతంగా తొర్రూరు మండలవ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు పరామర్శతో పాటు ఆర్థిక, నిత్యావసరాల సాయం అందిస్తూ తన వంతు భరోసా కల్పిస్తున్నారు.
బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
చీకటయపాలెం గ్రామానికి చెందిన సాదు వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని జక్కా మహబూబ్ రెడ్డి పరామర్శించారు. మృతుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కుటుంబానికి రూ.3,000 ఆర్థిక సాయం, 25 కిలోల బియ్యం అందజేశారు. అదే గ్రామానికి చెందిన డొంక సోమక్క అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె కుటుంబాన్ని కూడా పరామర్శించి ఆర్థిక సాయంతో పాటు 25 కిలోల బియ్యం అందించారు.
ఆపదలో ఉన్నవారికి అండగా
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని, అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శిస్తూ అవసరమైన మేరకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని ఏ గ్రామంలో కష్టం వచ్చినా స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని జక్కా మహబూబ్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పీసీసీ వైస్ చైర్మన్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి సహాయ సహకారాలతో ప్రజలకు మరింత అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని ఆయన తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
