* బొగత సందర్శన పునఃప్రారంభం
* అటవీశాఖ అధికారులు వెల్లడి
ఆకేరున్యూస్, ములుగు జిల్లా: ములుగు జిల్లా, వాజేడు సమీపంలో ఉన్న తెలంగాణా నయగారా బొగత జలపాతం సందర్శనకు వచ్చే పర్యాటకులను శనివారం నుంచి అనుమతిస్తున్నట్లు ఎఫ్ఆర్వో చంద్రమౌళి ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 31నుంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా ఫారెస్టు అధికారులను జలపాతం వద్దకు ఎవరినీ అనుమతించలేదు. ఇటీవల వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పర్యాటకులను సందర్శనకు తిరిగి అనుమతిస్తున్నట్లు తెలిపారు. అలాగే, పర్యాటకులకు సందర్శనకు మాత్రమే అనుమతి ఉందని, ఇతకొలనులో దిగేందుకు అనుమతులు లేవని చెప్పారు. బొగత జలపాతం వద్ద ప్రమాదం జగిగే ఆస్కారం ఉందని, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
————————-