* గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం
* బాధ్యతలు స్వీకరించిన అనంతరం సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్(HYDERABAD CITY POLICE COMMISIONER) గా సీవీ ఆనంద్ (CV ANANDH) సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి నుంచి చార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. పండుగల నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లను సమీక్షిస్తానని, లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉండేలా చర్యలు చేపడతామన్నారు.

డ్రగ్స్ పై ప్రభుత్వం సీరియస్ గా ఉందని, డ్రగ్స్(DRUGS) తో పాటు గంజాయి(GANJAYI)పై ఉక్కుపాదం మోపుతామన్నారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్.. నేరస్తులతో స్ట్రాంగ్ పోలీసింగ్ ఉంటుందని, ఫ్రెండ్లీ పోలీసింగ్ డిపార్టమెంట్లో ఓ భాగమన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఫైల్ పై ఒకసారి సమీక్షించిన తర్వాత మాట్లాడతాన్నారు.
—————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
