* యూట్యూబ్‌లో చూస్తూ ఆపరేషన్
* బీహార్ రాష్ట్రంలో ఘటన
ఆకేరున్యూస్, వరంగల్: బీహార్ లో ఓ నకిలీ వైద్యుడు యూట్యూబ్ లో చూస్తూ శస్త్ర చికిత్స చేసి 15సంవత్సరాల బాలుడి ప్రాణాలు బలితీసుకున్నాడు. బీహార్ లోని సరన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. సరన్ పట్టణానికి చెందిన కృష్ణకుమార్‌కు(15) వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు అక్కడి గణపతి సేవా సదన్ ఆస్పత్రికి తరలించారు. కొద్ది సేపటి తరువాత బాలుడికి వాంతులు తగ్గిపోయాయి. కానీ, అక్కడే ఉన్న నకిలీ వైద్యుడు అజిత్ కుమార్ మాత్రం బాలుడి పిత్తాశయంలో రాళ్లు ఉన్నాయని, వెంటనే శస్త్ర చికిత్స చేయాలని నమ్మబలికాడు. ఆ బాలుడి తండ్రిని పంపించి, యూ ట్యూబ్ లో చూస్తూ బాలుడికి ఆపరేషన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బాలుడి పరిస్థితి విషమించడంతో, వెంటనే పాట్నా వెళ్లాలని అంబులెన్స్ ను పిలిపించాడు. అంబులెన్స్ లో బాలుడిని తరలిస్తుండగా కృష్ణకుమార్ మార్గమధ్యంలో ప్రాణాలు ఒదిలాడు.
————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
