* ఎలాంటి ప్రాణనష్టం జరగక పోవడంతో ఊపిరిపీల్చుకున్న అధికారులు
* బీహార్ రాష్ట్రంలో ఘటన
ఆకేరున్యూస్, బీహార్: న్యూఢిల్లీ నుంచి బీహార్ లోని ఇస్లాంపూర్ కు వెళ్తున్న మగధ్ ఎక్స్ ప్రెస్ రెండుగా విడిపోయింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఎస్ 6 – ఎస్ 7 బోగీల మధ్య ఉన్న కప్లింగ్ తెగిపోడమే ఇందుకు కారణం. దీని వెనకాలే ఎటువంటి రైలు రాకపోవడంతో ప్రయాణికులు ఎవరికీ ఎటువంటి నష్టం వాటిల్లలేదు. దీంతో అధికారులు ఊపరి పీల్చుకున్నారు. ఆదివారం ఉదయం 11.08 గంటలకు బక్సర్ జిల్లాలోని ట్వైనింగ్ గంజ్-రఘునాథ్పూర్ స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న రైల్వే టెక్నికల్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు పూర్తి చేశారు. దీంతో మధ్యాహ్నం 2.25నిమిషాలకు రైలు తిరిగి బయల్దేరింది.
—————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
