కొత్త వేరియంట్ గుర్తింపు
ఆకేరు న్యూస్, న్యూఢల్లీి: కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా కలవర పెట్టిందో అందరికి తెలిసిందే. ఆ తరువాత ఇప్పుడు మంకీపాక్స్ కూడా కలవర పెడుతోంది. ఈ క్రమంలో కోవడి కొత్త వేరియంట్ మళ్లీ విజృంభిస్తోందన్న వార్త భయపెడుతోంది. కొవిడ్`19కు సంబంధించిన కొత్త వేరియంట్ ఎక్స్ఈసీ రూపంలో ఇప్పటికే యూరప్‌లో అంటు వ్యాధిలా విస్తరిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఈ ఎక్స్ఈసీ వేరియంట్‌ను తొలి సారి యూరప్‌లో గుర్తించారని తెలిపారు. అనంతరం ఈ వేరియంట్ యూకే, యూఎస్, డెన్మార్క్‌తోపాటు ఇతర దేశాలకు సైతం విస్తరించిందని పేర్కొన్నారు. ఇది రెండు ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ నుంచి ఎక్స్ఈసీ హైబ్రిడ్ రకంగా అవిర్భవించిందని వివరించారు. శీతాకాలంలో ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో దీనిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ లేదా బూస్టర్ డోస్ తీసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు. తద్వారా ఆసుపత్రిలో చేరడం కానీ, అనారోగ్యం బారిన పడడం కాని ఉండదని చెప్పారు. ఇప్పటికే 27 దేశాల నుంచి 500 శాంపిల్స్ సేకరించగా.. ఆ నమూనాల్లో ఎక్స్ఈసీ వేరియంట్ గుర్తించినట్లు వెల్లడిరచారు. డెన్మార్క్, జర్మనీ, యూకే, నెదర్లాండ్స్‌లలో ఈ ఎక్స్ఈసీ బలంగా పెరుగుతుందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. జ్వరం, గోంతు మంట, దగ్గు, వాసన తెలియక పోవడం, ఆకలి లేకపోవడం, ఒంటి నొప్పులు ద్వారా కొత్త రకం కోవిడ్ ఎక్స్ఈసీ లక్షణాలను గుర్తించ వచ్చన్నారు. పరిశ్రుభతను పాటించడంతోపాటు స్వచ్ఛమైన గాలిని పీల్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలకు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన (సీడీసీ) ఈ సందర్బంగా సూచించింది.
…………………………………………