ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్ కు డీఎస్పీ గా ఉద్యోగ నియామక పత్రం అందజేస్తున్న తెలంగాణ డీజీపీ జితేందర్
Published:
Updated: 19 Sep 2024 • 09:14 AM
- తెలంగాణ డీజీపీ జితేందర్ చేతుల మీదుగా డీఎస్పీగా నియామక పత్రం.
* మూడేళ్ల పాటు ప్రొబెషనరీ ట్రైనింగ్ - ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
అంతర్జాతీయ బాక్సర్ నికత్ జరీన్ కు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ పోలీస్) గా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది . ఈ మేరకు బుధవారం రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ నియామక పత్రాన్ని అందజేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నికత్ జరీన్ బాక్సింగ్ క్రీడలో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ గానూ, కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ ను ,ఏషియన్ గేమ్స్ లో బ్రాంజ్ మెడల్ ను గెలుచుకున్న విషయం విదితమే. ఇటీవల ప్యారిస్ లో ముగిసిన ఒలంపిక్స్ క్రీడలలో ఆమె పాల్గొన్నారు.
________________
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
