* గోవాలో అరెస్ట్
ఆకేరు న్యూస్ డెస్క్ : డ్యాన్సర్ పై లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2) కింద కేసులతో పాటు, పోక్సో(Pocso) కేసు కూడా నమోదు రావడంతో జానీ కోసం పోలీసులు బృందాలు గాలించాయి. చివరకు అతడిని గోవాలో (GOA ) అదుపులోకి తీసుకున్నట్టు తెలిసిందే. నార్సింగి పోలీసులు ఈ కేసు విచారణను వేగవంతంగా చేపడుతున్నారు. బాధితురాలి ఇంటికి వెళ్లి వాంగ్మూలం తీసుకున్నారు. షూటింగ్ సమయంలో కూడా క్యారవాన్‌లో బలవంతం చేసేవాడని ఆమె తన స్టేట్మెంట్లో పేర్కొంది. అనంతరం పోక్సో కేసు కూడా నమోదు చేసి అతడిని బెంగళూరులో ఎస్ ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్(Hyderabad)కు తీసుకుని వస్తున్నారు.
————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
