Published:
Updated: 20 Sep 2024 • 06:35 AM
ఆకేరు న్యూస్, మంచిర్యాల: కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రెండు లక్షల రుణమాఫీ చేస్తామరి హామీ ఇచ్చంది. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేసేలా చూడాలంటూ రాష్ట్ర గవర్నర్ జిస్టుదేవ్ వర్మకు రైతులు రెండో రోజూ ఉత్తరాలు రాశారు. గురువారం మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల రైతులు గవర్నర్కు ఉత్తరాలు రాసి పోస్టు చేశారు. అన్ని అర్హతలున్నా న్యాయం చేయడం లేదని, ఓట్లప్పుడు ఒక రకంగా.. గెలిచినాక ఒకతీరుగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. లేనిపోని షరతులు పెట్టి రైతులను ఆగం చేస్తున్నారని, ఇప్పటికైనా అందరికీ రుణమాఫీ చేసి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
