* వివరాలు వెల్లడిరచిన ఆప్ పార్టీ వర్గాలు
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎంగా అతిషీ శనివారం ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు ఆప్ వివరాలు వెల్లడిరచింది. సిఎం పదవికి అరవింద్ కేజీవ్రాల్ రాజీనామా తర్వాత, అతిషి ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో అతిషీని ముఖ్యమంత్రిని చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆప్‌కి చెందిన రాజ్యసభ ఎంపీ అతిషి సెప్టెంబర్ 21న శనివారం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ విషయాన్ని వెల్లడిరచింది. ఆమెతో పాటు ఇతర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 43 ఏళ్ల అతిషి సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ తర్వాత ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రి కానున్నారు. ఆమె ఆప్‌లో ప్రముఖ నాయకురాలు, మనీష్ సిసోడియా విద్యా మంత్రిగా ఉన్నప్పుడు సలహాదారుగా ఉన్నారు. దేశ రాజధానిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యారంగాన్ని మెరుగుపరచడంలో ఆమె కీలక పాత్ర పోషించారని ఆప్ నేతలు తెలిపారు. అతిషి పార్టీ ఆవిర్భవించిన సమయంలోనే చేరారు. ఆ తర్వాత 2013 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ మ్యానిఫెస్టో ముసాయిదా కమిటీలో కీలక సభ్యురాలిగా ఉన్నారు. ఆ పార్టీకి అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించారు. ఢిల్లీ ప్రభుత్వంలో చాలా శాఖలకు ఆమె బాధ్యత వహించారు. అంతకు ముందు మాట్లాడిన అతిషి పదవీ విరమణ చేసిన సీఎం అరవింద్ కేజీవ్రాల్ తనపై నమ్మకం ఉంచినందుకు సంతోషంగా ఉందన్నారు. కానీ ఆయన తన పదవికి రాజీనామా చేసినందుకు బాధగా ఉన్నట్లు చెప్పారు. ఈ క్రమంలో మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేజీవ్రాల్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేస్తానని అతిషి అన్నారు. మొదట తాను ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్, తన గురువు అరవింద్ కేజీవ్రాల్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వెల్లడిరచారు. కేజీవ్రాల్ ఇంత పెద్ద బాధ్యతను నీకే సాధ్యమని తనకు అప్పగించడం పట్ల అతిషి ఆనందం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియా అరెస్ట్ తర్వాత 2023 మార్చిలో అతిషి ఢిల్లీ క్యాబినెట్లో నియమితులయ్యారు. ఈ కేసులో సిసోడియా ఇటివల బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ క్రమంలోనే జాతీయ రాజధానిలో తిరిగి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నందున ఆప్ నేత అయిన అతిషికి ఈ సవాలు చాలా కీలకమని చెప్పవచ్చు. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం రాజ్ నివాస్‌లో జరిగే అవకాశం ఉంది. ఇది చాలా విచారకరమైన క్షణమని అతిషి స్వయంగా చెప్పారు. ఆమెను అభినందించవద్దని పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరడం విశేషం.
……………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
