
* తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు
ఆకేరు న్యూస్: న్యూఢల్లీి: మతం, కులానికి సంబంధం లేకుండా ప్రతి మహిళకూ గృహహింస చట్టం వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం 2005లో చేసిన గృహహింస చట్టం ప్రతి మహిళ హక్కులను పరిరక్షిస్తుందని స్పష్టం చేసింది. భరణం, పరిహారానికి సంబంధించిన కేసులో కర్ణాటక హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ మహిళ దాఖలు చేసిన అప్పీల్‌పై కోర్టు తీర్పును వెలురించింది. చట్టంలోని సెక్షన్ 12 కింద సదరు మహిళ పిటిషన్ దాఖలు చేసింది.
అంతకుముందు 2015 ఫిబ్రవరిలో మేజిస్ట్రేట్ కోర్టు మహిళకు నెలకు రూ.12వేలు, రూ.లక్ష పరిహారం చెల్లించాలని ఆమె భర్తను ఆదేశించింది. 2015 నాటి ఉత్తర్వులపై మహిళ భర్త అప్పీల్ దాఖలు చేశారు. చట్టంలోని సెక్షన్ 25 కింద ఆర్డర్‌ను మార్చాలని మహిళ భర్త మేజిస్ట్రేట్‌కు విజ్ఞప్తి చేయగా దాన్ని తిరస్కరించింది. దాంతో అతను అప్పీల్ కోర్టుకు వెళ్లగా అంగీకరించింది. ఇద్దరూ సాక్ష్యాలను సమర్పించాలని ఇరువర్గాలను ఆదేశించింది. దీంతో మహిళా హైకోర్టుకు వెళ్లగా పిటిషన్‌ను తిరస్కరించి భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించాల్సిందిగా మేజిస్ట్రేట్‌ని ఆదేశించింది. చట్టంలోని నిబంధనల ప్రకారం ఇచ్చిన ఆర్డర్లో మార్పు, సవరణలతో పాటు రద్దు చేయాలని కోరవచ్చని స్పష్టంగా ఉందని పేర్కొంది.
………………………………..