* చెరువులను, నాలాలను పరిరక్షించడమే లక్ష్యం
* మా వల్ల ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదు
* పేదల నిర్మాణాల జోలికి వెళ్లడం లేదు
* ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేశాం.. పక్కనున్న గుడిసెలను కూల్చలేదు
* సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం
* హైడ్రాపై వ్యతిరేకత కొంత మందికే పరిమితం
* మేం చర్యలు తీసుకోకపోతే.. నగర ప్రజలే బాధితులవుతారు
* మీడియా సమావేశంలో కమిషనర్ రంగనాథ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: హైడ్రా(hydra) అంటే బూచి కాదని, భరోసా ఇచ్చే సంస్థ అని కమిషనర్ రంగనాథ్ (Commissonar Ranganath) స్పష్టం చేశారు. కావాలనే సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. చెరువులను, నాలాలను పరిరక్షించడమే హైడ్రా లక్ష్యమని స్పష్టం చేశారు. మూసీ(Musi) ఆక్రమణల తొలగింపు అనంతరం హైడ్రాపై పెరుగుతున్న వ్యతిరేకత, ఓ మహిళ ఆత్మహత్య నేపథ్యంలో రంగనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తాము పేదల నిర్మాణాల జోలికి వెళ్లడం లేదన్నారు. ఎన్ కన్వెన్షన్(N Convention)ను కూల్చివేశామని, పక్కనున్న గుడిసెలను కూల్చలేదని వివరించారు. హైడ్రాపై వ్యతిరేకత కొంత మందికే పరిమితం అని తెలిపారు.
ప్రజలే బాధితులవుతారు..
అక్రమ నిర్మాణాలపై తాము చర్యలు తీసుకోకపోతే.. నగర ప్రజలే బాధితులవుతారని రంగనాథ్ వెల్లడించారు. పలుకుబడి ఉన్న కొందరు అక్రమ నిర్మాణాలు చేపట్టారని, వాటినే తాము కూలుస్తున్నట్లు వివరించారు. ఖాళీగా ఉన్న భవనాలను మాత్రమే కూల్చుతున్నామని, 2 నెలలుగా కూల్చివేతలు కొనసాగుతున్నాయని తెలిపారు. తాము కూల్చిన ఏ భవనానికీ అనుమతులు లేవని వెల్లడించారు. హైడ్రా కారణంగా ఎవరూ ఆత్మహత్యలు(Suicide) చేసుకోలేదన్నారు. తప్పుడు సర్వే నంబర్లతో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, ఆక్రమణల్లో పేదల ఇల్లు ఉంటే వాటికి జోలికి వెళ్లడం లేదని వివరించారు.
అది హైడ్రా పరిధిలో లేదు..
కేటీఆర్(Ktr) కు చెందినదిగా భావిస్తున్న జన్వాడ్ ఫామ్ హౌస్(Janwada Form House) హైడ్రా పరిధిలోకి రాదని రంగనాథ్ వివరించారు. మల్లారెడ్డి, ఇతర ప్రముఖుల విద్యాసంస్థలు ఆక్రమణల్లో ఉన్నాయని, విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని వారికి సమయం ఇచ్చినట్లు తెలిపారు. హైడ్రాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, తాము సెలైంట్‌గా ఉండడం లేదని, ఎంతో గ్రౌండ్ వర్క్ చేస్తున్నామని తెలిపారు. 111 జీవో (111 Go) హైడ్రా పరిధిలోకి రాదన్నారు. చెరువులు, నాలాల పరిరక్షణపై సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో వేలాది ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయిన్నారు. కూకట్పల్లి నల్లచెరువులో ఆక్రమణలను కూల్చేశామని తెలిపారు. సరైన సమయం ఇచ్చిన తర్వాతే ఆక్రమణలు కూలుస్తున్నట్లు తెలిపారు. అమీన్పూర్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని తెలిపారు.
…………………………………..